Saturday, June 4, 2011

Tuesday, May 31, 2011

టెట్ ఇదొక బ్రహ్మ పదార్ధం

టెట్ ఇదొక బ్రహ్మ పదార్ధం ఎవ్వరికి అర్థం కాని వింత పదార్ధం . మన పిల్లలకు ఏది కావాలో , ఎవరిని అడిగి నిర్ణయించాలో ఎలాంటి ఉపాధ్యాయులను తయారు చేసుకోవాలో తెలియని అధికార పిపాస రాయుళ్ళ పుర్రెలో పుట్టిన పనికిమాలిన ఆలోచన. ఒక ఉపాద్యాయుడు విద్యార్థికి ఏమి నేర్పించాలి . అది నేర్పడానికి ఉపాధ్యాయునికి ఉండాల్సిన అర్హతలు ఏమిటి . ఒక్కడే ఒకటి కన్నా ఎక్కువ విషయాలు చెబితే జరిగే నష్టం ఎంత ? ఎక్కువ మందితో అనేక విషయాలు చెప్పించడం వల్ల విద్యార్థికి కలిగే లాభం ఎంత ? అతని ప్రవర్తనలో కలిగే మార్పు ఎంత?
పాపం టెట్ వ్రాస్తున్న నిరుద్యోగులు వింత సమస్యను ఎదుర్కొంటున్నారు ? అ ఆ ల నుండి తెలుగు వ్యాకరణం అంతాచదివింది ఒకటి ? చదవాల్సింది మరొకటి ? వ్రాసేది మరొకటి ? ఏమి ఖర్మ ? ఏమి మన నిరుద్యోగుల దౌర్భాగ్యం ? భవిష్యత్తు కు కావలసిన సరుకు ఇలాగేనా సిద్దం చేసుకొనేది . అభం శుభం తెలియని పసిపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. స్వీయ భాషలను గొంతు పిసికి చంపుతున్నారు ? భాషకు ప్రాణం వ్యవహారం . పిల్లలుకూడా సరిగా మాట్లాడకుండా , వారి జీవితంలో స్వంత భాష ఒక భాగం కాకుండా పరాయి భాషలో మిడిమిడి జ్ఞానాన్ని సంపాదించి ఉత్తర కుమారులలా వెలిగేలా తీర్చి దిద్దు తున్నాము . బాగుంది ! తల్లి భాషలో శక్తి సంపాదిస్తే వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు ను స్వయంగా తీర్చి దిద్దుకోగలరు . మన పిల్లలను కాపాడుకొందాం. మనలని కాపాడుకొందాం

Thursday, February 11, 2010

తెలుగు వెలుగులు ఎక్కడ

మసక బారిన మన బతుకుల్లాగే మన భాష కూడా మసక బారి పోతున్నది. తెలుగు రాణి పంతుళ్ళు , తెలుగు మాట్లాడలేని పిల్లలు, తెలుగు కనపడని వీధులు , తెలుగు మాట్లాడని అధికారులు.
సిగ్గు సిగ్గు ఏ దేశంలో ఉన్నాము. మన భాషను ప్రేమించలేని , పలకలేని మనుషులమధ్య మన బతుకులు ఎలాసాగు తాయి .

Wednesday, January 20, 2010

జై తెలంగాణా
మన భాష తెలంగాణా
మన శ్వాస తెలంగాణా
మన గోస తెలంగాణా
కాలం విలువ తెలిస్తే ప్రాణాలు ఇలా తీసుకోరు
నిండు నూరేళ్ళ జీవితాన్ని అర్ధాంతరంగా వదిలివేయడం
ఏ లక్ష్య సాధనకొరకు ఎవరు అనుభవించడం కొరకు
బ్రతికి సాధించు జీవించి అనుభవించు
నీ పోరాట స్ఫూర్తి నలుగురిలో నింపు

Sunday, June 21, 2009

చదువుల వ్యాపారం - బడుగుల హా హా కారం

నిన్న మా మహబూబ్ నగర్ లో పుస్తకాలు అమ్మే షాప్ వాళ్లు అందరు కలసి షాపులు మూసివేసినారు . ఎందుకని అంటే ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు వాళ్ల పిల్లలు కొనవలసిన పుస్తకాలు వాళ్ళే తెచ్చి అమ్ముకుంటున్నారు. అంతటితో పోనివ్వక నోటు పుస్తకాలు కూడా ( అవే కావు లెండి టై, బెల్ట్, డైరీ, షూస్, లేసెస్, చిరుతిండి, వగైరా వగైరా ) వాళ్ళే ఉడతా భక్తిగా పిల్లలకు వాటి మీద ఉండే ఎం.ఆర్. పి రేట్ కే అమ్ముతున్నారు. అదే బయట అవుతే పది నుండి ముప్పై శాతం తక్కువకే దొరుకుతాయి. అంటే డెబ్బయి శాతంలో షాప్ వాళ్లకు వచ్చే లాభం ఎంత ?
పిల్లలను స్కూల్ వాళ్లు దోచుకుంటున్నారు వాళ్ల బారి నుండి వాళ్ళను కాపాడి మమ్మల్ని కాపాడమంటూ జిల్లా విద్యా శాఖాదికారికి మొర పెట్టుకున్నారు.
పాపం పిల్లలకు కావలిసిన పెన్సిల్, పెన్ను, ఎరేసేర్ , కంపాస్ బాక్స్ , మొదలైన వస్తువులు అన్ని స్కూల్ వాళ్ళే అమ్ముతూ రెండు చేతులా సాయం చేస్తున్నారు?
పాఠాలు చెప్పుకొండిరా నాయనా అంటే వ్యాపారంలోకి దిగితే వ్యాపారం చేసే వాళ్లు ఇంక ఏమి చెయ్యాలి ?
ప్రభుత్వ నియంత్రణ లేక ప్రైవేట్ పాఠశాలలు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తుంటే అడిగే నాథుడు లేడు. ఫీజు లు దాదాపు ౪౦ శాతం పెంచినా అడిగే దిక్కు లేదు. పోనీ పెంచిన ఫీజులు ఉపాధ్యాయులకు కొంతన్నా చేరుతాయ అంటే అదీ లేదు . ఈ ఏడు ఉన్నా టీచర్ వచ్చే ఏడు ఉంటాడా అంటే చెప్పేది కష్టం.
ఎవర్ని పడితే వాళ్ళను పెట్టి పాఠాలు చెప్పిస్తుంటారు. అదేమిటంటే ఇష్టం ఉంటే ఉంచండి లేదంటే తీసుకు వెళ్ళండి అంటు దబయిస్తున్నారు. ఇరుకు గదుల్లో, వెలుతురు, గాలి ఆడని చోటులో వాళ్ల చదువులు దేవునికే తెలియాలి. ఎల్కేజీ పిల్లలకు ఫీజు 4500 పదవ తరగతి పిల్లవాడికి 20వేల వరకు వుంటుంది. "చదువు కుంటున్నామా" లేక "చదువు కొంటున్నామా" ? అంగడి సరుకు అయిపోయిన చదువులు ఎ అభివృద్దికి చిహ్నాలు ?
రాజ్యాంగ బద్దంగా వారికి రావలిసిన బడ్జట్ ప్రణాళికలలో కేటాయించక పోవడం వల్ల పిల్లలకు అందవలసిన ఉచిత విద్య అపహాస్యం పాలౌతున్నది. పిల్లలను హాస్టల్లో వేసి చేతులు దులుపుకుంటున్న తల్లి తండ్రులు లక్షల మంది. పిల్లల ముఖాల్లో చిరునవ్వు స్థానంలో వీళ్ళకు ఎందుకు పుట్టమురా భగవంతుడా ? ఈ చదువులు ఎందుకురా భగవంతుడా ? డబ్బే ముఖ్యమా ? జీవితం అంటే డబ్బేనా ? అన్ని సందేహాలే ? నీతి, నిజాయితీ , ధర్మం, న్యాయం, సహనం, శాంతం, సమత్వం, అన్నీ బూటకం పాఠాల్లో ఉండే అంశాలు ఒకటి, బయట కనిపించేవి మరొకటి, దేన్ని నమ్మాలో దేన్ని కాదనాలో తెలియక బిక్క మొఖం వేస్తున్న పిల్లలను చూస్తుంటే పెద్దరికం వహిస్తున్న వాళ్ల వీపులు ఉపాధ్యాయునిగా చిట్లగొట్టాలి అనిపిస్తుంది. ( గురువులైన వారు గుద్దితే ఏమయ ) అన్నారు వేమన .

Friday, June 19, 2009

పుస్తకాలు లేని చదువులు

పాఠశాలలు ప్రారంభమయ్యాయి కాని పుస్తకాలు మాత్రం అందలేదు . కారణం ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వలేదు, అధికార్లు స్పందించలేదు, న్వూస్ ప్రింట్ సకాలం లో అందలేదు , ఇండెంట్ మాకు అందించలేదు . కర్ణుని చావుకు కారణాలు అనేకం అలాగే పుస్తకాలు అందాకా పోవడానికి కారణాలు అనేకం . ప్రభు భక్తి చాటుకునే వారు ఆందరూ, ప్రైవేటు భక్తి చాటు కునే వారు కొందరు, వెరసి పిల్లల తల్లి తండ్రుల జేబులకు చిల్లు పెడుతున్నారు.
ఒకే పుబ్లిషెర్ ఉచిత పాఠ్యపుస్తకాలు , అమ్మకపు పాఠ్యపుస్తకాలు సరఫరా చెయ్యాలి . కావలిసినన్ని ఉచిత పాఠ్య పుస్తకాలు అందించకపోవడానికి రకరకాల సాకులు చెబుతారు. అదే బజారులో అమ్మడానికి కావలిసినన్ని పుస్తకాలు అందుబాటులో ఉంచుతారు.
ఈ మారు వచ్చిన ౧ ,౩, ౫ తరగతుల పుస్తకాల అట్టలు మరీ అద్వాన్నంగా ఉన్నాయి. ప్రింట్ సరిగా లేదు, కలర్ సరిగా లేదు, బొమ్మలు సరిగా లేవు అసలు టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందినా తరువాత మన పిల్లల పుస్తకాలు ఇలా ఉండటం సిగ్గు చేటు .
౧౪ ఏండ్ల లోపు పిల్లలకు అందరికి ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగానే పాఠ్యపుస్తకాలు అందచేయాలి. నాణ్యతతో కూడిన విద్యకు నాణ్యమైన పుస్తకాలు అవసరం. ఆలోచించండి .

Monday, June 8, 2009

గిలిగింత

ఏమండీ ! మీరు ఇంతకు ముందు నన్ను రంభా , ఊర్వశి , మేనక అంటూ పొగిడేవారు !
ఇప్పుడు ముచ్చటకైన అనరేం ?
" నిన్నటి నుండి అబద్దాలాడ కూడదని నిశ్చయించుకున్నాను ".

పెళ్ళంటే ?

  • పోలీస్ లు గుర్తించిన స్నేహం
  • ఫ్రీ స్పీచ్ ను అణచే చట్ట బద్ధమైన వ్యవస్థ
  • ఆడది అదనపు జీతం లేకుండా ఓవర్ టైం చేసే ఏకైక ఉద్యోగం.
  • సంసారి దు:ఖి
  • మగాడు బాచిలర్ డిగ్రీ పోగొట్టుకుంటే ఆడది మాస్టర్ డిగ్రీ సంపాదించడం.
  • పెళ్లి చేసుకోవడం అంటే హోటలుకు వెళ్ళడం లాంటిది. మీకేం కావాలో ఆర్డర్ చేస్తారు. కాని పక్క వాళ్ల ప్లేట్ లో ఏముందో చూసాక , మీరూ అదే ఆర్డర్ చేసి ఉండాల్సింది అని అనుకుంటారు.

విడాకులంటే

  • ఆరిపోయిన ప్రేమ జ్వాల
  • ఇరుగు పొరుగుకు శాంతినిచ్చేది
  • వంటవాడిని పోగొట్టుకోవడం
  • ఐకమత్యమే బలం అన్న సిద్ధాంతాన్ని తప్పు అని ఋజువు చేసేది.
  • వియ్యాల వారి కయ్యాలకు పుల్ స్టాప్ .

Sunday, June 7, 2009

సమస్యా పూరణం

సమస్య - మగనిని కొట్టిన మగువయె మంచిది ఇలలో

తగవాడక తనువాడక
వగపులు చూపక నిరతము వంచన మదిలో
పగరేపక వలపులతో

మగనిని కొట్టిన మగువయె మంచిది ఇలలో

సంస్కృత పద జ్ఞానం

సూచన :- పదాలకు అర్థాలు వాక్యప్రయోగాలను దృష్టిలో ఉంచుకొని చెప్పాలి.

అంగుళి ముద్రా - అక్షరాలు గల ముద్దుటుంగరము ( అక్షరాలు గల ఉంగరము )
మీ అంగుళి ముద్ర చాలా బాగున్నది.
అంతరాళం _ అష్ట దిక్కుల మధ్య గల ప్రదేశం .
ఓయి రాక్షసా అంతరాళంలో నీవు ఎక్కడ ఉన్నా పట్టి బంధిస్తాను.
అంతర్వాణి: - శాస్త్రము తెలిసిన వాడు.

సభలో అంతర్వాణి మాత్రమే శాస్త్ర చర్చలో పాల్గొంటాడు.