నాపేరు కట్టా గిరిజా రమణ నేను తెలుగు పండిట్ గా ప్రభుత్వ ఉన్నత పాఠశాల షాబజార్ మహబూబ్ నగర్ లో పనిచేస్తున్నాను.. నేను కవిగా, రచయితగ, రంగస్థల కళాకారునిగా , ఉపాధ్యాయునిగా, ఉపాధ్యాయ నేతగా వ్యాఖ్యాతగా, సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడిగా వివిధ రూపాలలో సేవలు అందిస్తున్నాను.
విద్యా సంబంధమైన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటుంటాను. 10వ తరగతి విద్యార్థుల కొరకు రమణీయ అభ్యాస దీపికను రచించినాను. మహబూబ్ నగర్ జిల్లాలో సుమరుగా 100కు పైగా పాఠశాలల్లో ఉపయోగిస్తున్నారు. నా గురువుల ఆశీర్వాద బలంతో ఉపాధ్యాయులకు శిక్షణ , విద్యార్థులకు క్రమశిక్షణ ఇస్తుంటాను.
"నాకు తెలిసింది బిందువంత తెలియనిది అనంత సింధువంత." ఇది నేను నమ్మిన సూక్తి
తెలుగంటే ప్రాణం. తెలుగువాడినని గర్విస్తాను. తెలుగు పురోభివృద్ధికొరకు పాటుపడుతుంటాను.
0 comments:
Post a Comment