Sunday, June 7, 2009

తెలుగు రాని కొత్త తెలుగు పంతుళ్ళు

తెలుగు రాని కొత్త తెలుగు పంతుళ్ళు - తెలుగు లేని కొత్త లోగిళ్ళు -

రాష్ట్రంలో ఈమధ్య జరిగిన ఉపాధ్యాయుల పదోన్నతుల తీరు అందులో వారు పాటించిన నియమాలు విద్యార్థుల పాలిటశాపాలుగా మారనున్నాయి.
ముఖ్యంగా తెలుగు ప్రమోషన్ల విభాగంలో గ్రేడు తెలుగు పండితులు కావలసినంత మంది అందుబాటులో ఉన్నావారిని కాదని నిన్నమొన్న ఎం. తెలుగు పాసయిన వారికి పదోన్నతులు కల్పించినారు. వీరికి తెలుగు బోధించినఅనుభవం లేదు . సరికదా ఇప్పుడు వీరు చెప్పవలసింది ఉన్నత తరగతులకు.
విద్యార్థులను , తెలుగును దేవుడే కాపాడాలి. ఆంధ్రజ్యోతి, టి.వి. సాక్షి, మొదలైన మాధ్యమాలు దీనిగురించిప్రభుత్వానికి హెచ్చరికలు చేసినా , డైరెక్టర్, సెక్రటరి , విద్యాశాఖామాత్యులు , ముఖ్య మంత్రి గారు ఎవ్వరుపట్టించుకోలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు తెలుగును సక్రమంగా బోధించే ఉపాధ్యాయులను అందుబాటులోఉంచాల్సిన ప్రభుత్వం మాత్రం భాషపై పట్టు లేని ఉపాధ్యాయులును పదోన్నతులిచ్చి విద్యార్థుల జీవితాలతోఆటలాడుకోవడం దురదృష్టకరం .
రాష్ట్రంలో తెలుగును ప్రత్యేకంగా నేర్పించే కళాశాలలు ( ఓరియంటల్ కళాశాల పేర ) నడుస్తున్నాయి. వీటిలో చదువుకునిఉద్యోగాలు సంపాదించి ఉపాధ్యాయ వృత్తిలో ౨౫ ఏండ్లుగా తెలుగును బోధించిన అనుభవం గల భాషో పాద్యాయులనుకాదని తెలుగు భాష గురించి అవగాహన లేని వారిని గ్రేడ్ తెలుగు పండితులుగా నియమించడం భాషాభివృద్దికి విధంగాను మంచిది కాదు.
మన తరువాతి తరాలకు మనమిచ్చే భాషావారసత్వం ఇలా ఉంటే రేపటి తరం భాషా దారిద్ర్యం అనుభవించక తప్పదు.
విజ్ఞులైన వారంతా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే తరాలకు మన భాషను బలంగా అందించాల్సినఅవసరం ఉంది.
భాషలు అభివృద్దికి మూల కందాలు.
భాషలను హ్యుమానిటీస్ అంటారు . అనగా మానవీయ శాస్త్రాలు. ఇవి మనిషి జీవించడానికి కావలసిన , సృజించడానికికావలసిన శక్తిని ఇస్తాయి.
కనుక కేవలం భాషలు అంటూ తేలికగా చూడవద్దు. తెలుగు భాషాభివృద్ధి మన రాష్ట్ర అభివృద్దిపై ప్రభావాన్నిచూపుతుంది.
తెలుగును బలోపేతం చేద్దాం. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకుందాం .

3 comments:

  1. sir ! namaskaar
    Iam NARESH KUMAR THURPINTI ...I saw ur blog excellent....My native place also MBNR dt ...I wrote some blogs in the net ..plz see http://tuurpinti-telugumentors.blogspot.com,
    http://kollapurthurpinti.blogspot.com,http
    ://telugusaahityam-tuurpinti.blogspot.com,

    ReplyDelete
  2. sir ! namaskaar
    Iam NARESH KUMAR THURPINTI ...I saw ur blog excellent....My native place also MBNR dt ...I wrote some blogs in the net ..plz see http://tuurpinti-telugumentors.blogspot.com,
    http://kollapurthurpinti.blogspot.com,http
    ://telugusaahityam-tuurpinti.blogspot.com

    ReplyDelete
  3. Hello Bawa,
    Meeru tayaru chesina ee site chala bagundi. Deentloni anni archives bagunnai. Konni 'Haasyaanni' andiste.. marikonni 'Bhaasha paramaina' viluvalani nerpistunnai.

    Ee archive lo meeru raasina vyasam chala mandi kallu teruchukunela undi. Telugu kosam, Vidyaarthula kosam meeru chesina suchanalu kanuka prabhutvam vaaru amalu cheste raaboye kaalaallo 'Swaccha maina Telugu Bhaasha'andariki andubaatulo untundi.

    ReplyDelete