అన్యోన్య దాంపత్యం
ఓ సారి మునిమాణిక్యం గారు శివశంకర శాస్త్రిగారితో ఇలా అన్నారు
" అన్నగారూ ! నాకు మా ఆవిడకు నిమిషం పడదు?. నేనేనా మన సాహితి మిత్రులు కూడా అందరు ఇంతేనా ?
" మూక ఉమ్మడిగా కాదు ఒక్కొక్కరి గురించి అడగండి చెబుతాను " అన్నారు శివశంకరులు .
" ముందు చెళ్ళపిళ్ళ వారి గురించి చెప్పండి."
" చెళ్ళపిళ్ళ వారిది అన్యోన్య దాంపత్యమే , ఏమంటే శాస్త్రి గారూ ఎప్పుడూ ఇంట్లో వుండరు . నానా రాజ సందర్శనం అంటుఅన్ని రోజులు దేశాలు తిరగడమే ! ఇక ఇంట్లో ఉండేది ఎప్పుడు దేబ్బలాడుకునేది ఎప్పుడు. అందుకే వాళ్ళది అన్యోన్యదాంపత్యం.
" మరి గిడుగు రామమూర్తి గారిదో "
" ఆయనిది కూడా అన్యోన్య దాంపత్యం. ఆయనకి బ్రహ్మ చెముడు . ఆవిడ తిట్టే తిట్లు ఆయనకు వినపడవు. అందువల్లఇద్దరిమధ్య కజ్జాల్లేవు "
" జమ్మలమడక వారిది ?"
" వారిది కూడా అన్యోన్య దాంపత్యమే ! ఏమంటారా ? అయన సంస్కృతంలో గాని మాట్లాడరు. ఆవిడకు సంసృతం రాదు. భాషా భేదం కారణంగా పొరపొచ్చాలు రావు .
" కృష్ణ శాస్త్రిగారు "
" ఆయన ఎప్పుడు ఉహా లోకంలో ఉంటారు . వాస్తవ లోకంలోకి వస్తే కదా భార్యతో దెబ్బలాడడానికి .
" ఇక మరి మీరో ?"
నేను తీరా దెబ్బలాడడానికి సిద్దం అయ్యేసరికి మా ఆవిడ చచ్చిపోయింది. అని బోసి నోటితో పకపక నవ్వారు.
Sunday, June 7, 2009
Subscribe to:
Post Comments (Atom)

బాగుందండి.
ReplyDeleteమీ పోస్టులు చాలా బాగుంటున్నాయి.సున్నితమైన హాస్యాన్ని అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది.
ReplyDeleteహ హ హ. ఈ సంభాషణ ఎప్పుడూ వినలేదు.
ReplyDeleteమీరు మొదట East of the Italian అని పెడితే ఇదేదో బాగుందే అనుకున్నాను. మీరేమో నాలిక్కొరుక్కుని టైటిలు మార్చేశారు! ప్చ్!